చంద్ర అభిలాష – 28
వాళ్ళ వేషాలకి తార, నేను నవ్వుకున్నాం, తరువాత తార మాట్లాడుతూ “ సరే…. సరే…. పోదాం పదండే…. ఇప్పటికే ఆలస్యం అయ్యింది….” అని చెప్పింది, వాళ్ళు కూడా నవ్వుకున్నారు. అందరం కారులో కూర్చొని రాజమండ్రికి బయలుదేరాం.
మా కారులో నవ్వులు కేరింతలతో రాజమండ్రి చేరుకున్నాం. టౌన్ లోకి రాగానే తార రూట్ చెప్తూ సినిమా హాల్ కి తీసుకెళ్లింది, తీరా దిగి చూస్తే అదొక దెయ్యం సినిమా. మళ్ళి అది చూసి తారతో “ అవసరమా….” అని అడిగాను.
తార గంభీరంగా “ అవసరమే….” అని చెప్పింది, ఇక చేసేదేమీ లేక నేను కూడా వాళ్ళతో కలిసి లోపలికి వెళ్ళాను. ఉదయం పూట కావడంతో హాల్లో ఎక్కువ జనాలు లేరు, అందుకనే మేము ఉన్న సీట్ల వరుస మొత్తం ఖాళీగా ఉంది.
సీట్లలో అటువైపు నుంచి పూజ, రాధ, నేను, తార, నీలిమ కూర్చొన్నాం.
సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే తార గెట్టిగా నా చేతిని చుట్టేసింది, అది చూసిన ముగ్గురూ నవ్వుతున్నారు.
నేను తన తల మీద మొటిక్కాయ వేస్తూ “ నేను అవసరమా అని అప్పుడే చెప్పా…. నా మాట వినకుండా పెద్ద ఝాన్సీ రాని లక్ష్మి భాయి లాగా అవసరమే అన్నావ్…. ఇప్పుడు చూడు మళ్ళి నన్ను కరుచుకున్నావ్….” అని చిన్నగా నవ్వాను.
తార తడబడుతూ “ అ…అదేం లేదు బావ…. నువ్వు భయపడకూడదని….” అని ఇంకా ఏదో చెప్తుంటే సినిమాలో దెయ్యం గెట్టిగా అరిచింది, దాంతో తార భయపడుతూ సీట్లో నుంచి ఎగిరి నా వొళ్ళో కూర్చొని నన్ను గెట్టిగా హత్తుకుంది.
నేను ఎంత చెప్పినా తను వినిపించుకోకుండా అలానే ఉంది, ఇంటర్వెల్ బెల్ మోగగానే తనే లేచి పక్కన సీట్లో కూర్చొని తలదించుకుంది. నేను నవ్వుతూ “ సరేలే…. వెళ్ళిపోదామా!!…. ఉందామా!!….” అని అడిగాను, తార తడబడుతూనే “ ఉందాం….” అని బదులిచ్చింది, మేమందరం ముసి ముసిగా నవ్వుతున్నాం.
మా నవ్వును చూసిన తార కోపంగా మొహం పక్కకు తిప్పేసింది, నేను బయటికి వెళ్ళి అందరికి సమోసాలు, పాప్ కార్న్, కూల్ డ్రింక్ తీసుకొచ్చాను.
ఇంటర్వెల్ తరువాత సినిమా స్టార్ట్ అవ్వగానే మధ్యలో కొన్ని రొమాంటిక్ సీన్స్ వచ్చాయి, అప్పుడు తార మెల్లిగా నా చేతిపై చెయ్యేసి నావైపు దొంగ చూపులు చూస్తుంది.
నేను గమనించక పోవడం చూసి మనసులో “ ఈ మనిషి ఏ గ్రహం నుండి వచ్చాడో ఏమో…. అరే పక్కన నిగ నిగలాడే జామ పండులాంటి పాపుంది…. ఒక ముద్దు లేదు ముచ్చట లేదు…. ” అని చిరాకుపడింది కాని నేను నా మనసులో “ ఇప్పుడు గనక మధు నా పక్కన ఉంటే ఎంత బాగుండో…. అయినా ఒకరోజు నేను, మధు మాత్రమే సినిమాకి రావాలి….” అని అనుకుంటూ మురిసిపోయాను.
మళ్ళి కొద్ది సేపటికి దెయ్యం తారని బెదరగొట్టింది, తార నన్ను కరుచుకుంది. సినిమా అయిపోయి అందరూ వెళ్ళిపోతుంటే రాధ తారని తడుతూ “ లేవే తల్లి…. ఎప్పుడు ఇంతే…. దెయ్యం సినిమాకి తీసుకురావడం…. ఇలా భయపడటం…. వద్దంటే వినవు కదా….” అని చెప్తుంది.
తన మాటలకి తార ఉడుక్కుంటూ “ నేనేమీ భయపడలేదు…. నిద్రపోయాను అంతే….” అని బుంగ మూతి పెట్టింది. ఇంకా ఏడిపిస్తే బాగోదని అందరం తారని బుజ్జగించి బయటకి వచ్చేసి కారులో కూర్చొన్నాం.
నేను కారుని డ్రైవ్ చేస్తూ “ నెక్స్ట్ ఎక్కడికి ??….” అని అడిగాను, అందరూ ఒకేసారి “ బిర్యానీ….” అని అరిచారు. మేమందరం నవ్వుకుంటూ పెద్ద ఫైవ్ స్టార్ రెస్టారెంట్ కి వెళ్ళాం, అక్కడ వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది, ముఖ్యంగా భోజనాన్ని చిన్న ట్రైన్ ద్వారా టేబుల్ దెగ్గరికి పంపిస్తున్నారు.
తార వాళ్ళు ఉత్సాహంగా ఫుడ్ ఆర్డర్ ఇచ్చి కబుర్లు చెప్తున్నారు, కాసేపటికి ట్రైన్ ఒక ఫుడ్ ఐటెం తీసుకొచ్చింది. అది వచ్చేటప్పుడు మామూలు ట్రైన్ సౌండ్ చేసినట్టు “ కూ…. చుక్ చుక్ చుక్….” అని వచ్చింది, దానికి తగ్గట్టు గానే వీళ్ళు కూడా “ కూ…. చుక్ చుక్ చుక్….” అని అరిచారు, దెబ్బకి నాకు నవ్వాగలేదు.
నన్ను నేను మర్చిపోయి వాళ్ళతోపాటే “ కూ…. చుక్ చుక్ చుక్….” అంటూ అరుస్తూ ఎంజాయ్ చేసాను, మా చేష్టలు చూసి అక్కడున్న వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు.
మేమందరం నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ వెరైటీ వెరైటీ ఐటమ్స్ తిన్నాము. నా కడుపు ఫుల్ అవ్వడంతో నేను ముందుగా వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చాను, తరువాత వాళ్ళు నలుగురూ వెళ్ళారు.
ఇంతలో వెయిటర్ బిల్ తీసుకొని వచ్చాడు, నేను బిల్ కట్టేసి అతనికి టిప్ ఇచ్చి తార వాళ్ళకోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడే నా వెనుక నుండి “ Excuse me….” అనే పిలుపు వినిపించింది, నేను ఆ పిలుపుని గుర్తుపట్టి మనసులో “ ఇది తన గొంతే…. అంటే వెనకాల తను ఉందా….” అనుకొని ఆలోచిస్తున్నాను.
వెనకనుండి ఆ మనిషి “ హలో…. మీరు తినడం అయిపోయిందని వెయిటర్ చెప్పాడు…. మీరు వెళితే మేము కూర్చొంటాము….” అని పొగరుగా చెప్పింది. నేను మొహం చిట్లించి మనసులో “ దీనికి ఇంకా పొగరు తగ్గలేదు….” అనుకొని కదలకుండా అలానే కూర్చునాను.
తను కోపంగా “ హలో…. చెప్పింది వినిపించలేదా, చెవుడా….” అని ఇంకా ఏదో చెప్తుంటే నేను వెనక్కి తిరిగాను. నన్ను చూసి తను షాక్ తో “ చంద్ర…. నువ్వా!!…” అని ఆశ్చర్యంగా అనింది.
నేను ఏమీ మాట్లాడకుండా తన వైపే చూస్తున్నాను, తను తేరుకొని “ అరెరే చంద్ర…. నువ్వేంటి ఇక్కడున్నావ్….” అని నవ్వింది, మళ్ళి తనే మాట్లాడుతూ “ వెయిట్…. వెయిట్…. కొంపదీసి ఇక్కడ వెయిటర్ గానో, క్లీనర్ గానో పనిచేస్తున్నవా ఏంటి….” అని వెటకారంగా మాట్లాడింది.
నేను సైలెంట్ గా తన వైపే చూస్తున్నాను, ఇంతలో తన ఫ్రెండ్ కల్పించుకొని “ హేయ్ లత…. ఇతను నీకు తెలుసా….” అని అడిగింది. లత నావైపు హీనంగా చూస్తూ “ వీడి పేరు చంద్ర…. మా ఆఫీసులో సరిగ్గా పని చెయ్యట్లేదని కొన్ని నెలల ముందు పీకేసారని చెప్పాను కదా….” అని చెప్పింది.
లత ఫ్రెండ్ నావైపు చూస్తూ “ ఓహో…. అది ఇతనేనా…. అయినా పక్కనోల్ల పనిని తన పనిగా చెప్పుకొని మోసం చేస్తే ఇలానే జరుగుతుంది…. నువ్వు వీడిని వదిలించుకొని చాలా మంచి పని చేశావ్….” అని డబ్బా కొట్టింది.
తన మాటలకి లత పొంగిపోతూ నాతో “ ఏంటి…. ఏమీ మాట్లాడటం లేదు…. చూసావా, ఆ రోజు నన్ను తప్పుబట్టావ్…. ఈరోజు దిక్కులేనివాడిలా ఇలా అంట్లు తోముకుంటున్నావ్….” అని చెప్పింది.
నేను ఇంకా సైలెంట్ గానే తన వైపు చూస్తున్నా, తను పొగరుగా “ వెళ్ళు…. వెళ్ళి మెనూ కార్డు తీసుకొని రా…. కంగారుపడకు, కావాలంటే టిప్ కొంచం ఎక్కువే పడేస్తాలే…. ఎంతనైనా నువ్వు నాకు తెలిసిన వాడివి కదా….” అని నవ్వుతుంది, తనతో పాటు తన ఫ్రెండ్స్ కూడా నవ్వుతున్నారు.
అలా నవ్వుతున్న లత చెంపని ఒక్కసారిగా గెట్టి పిడుగుపడ్డట్టు ఒక చెయ్యి తాకింది, దెబ్బకి నవ్వుతున్న లత “ధబ్…” అంటూ నేలని కరుచుకుంది.
సందడిగా ఉన్న రెస్టారెంట్ లతపై పడిన చెంప దెబ్బకి సైలెంట్ అయిపోయింది, కాసేపటికి తార తేరుకొని చెంప మీద చెయ్యి వేసుకొని పైకి లేచి కోపంగా నా పక్కనున్న వ్యక్తి వైపు చూస్తూ “ ఎవత్తి వే నువ్వు….. ఎంత ధైర్యముంటే నన్నే కొడాతావ్….” అని ఇంకా ఏదో చెప్తుంటే, తన రెండో చెంపపై కూడా దెబ్బ పడింది.
లత ఆశ్చర్యంగా చూస్తుంటే, నా పక్కనున్న తార వెటకారంగా “ నీలాంటి అడ్డగాడిదని కొట్టడానికి ధైర్యం ఎందుకే…. నా చేతులు చాలు….” అని అనింది, దానికి మా వెనకున్న తార ఫ్రెండ్స్ నవుతున్నారు.
లత కోపంగా “ ఎవరే నువ్వు…. వీడ్నంటే నీకేమైందే…. అసలు మీ ఇద్దరికి సంబంధం ఏముందే….” అని అడిగింది, తార నా చెయ్యిపట్టుకోని “ ఈయన నా బావ…. అర్థమైందా…. ఇంకోసారి నా బావను ఏమైనా అన్నావో, నిన్ను బుడదలో పొర్లాడిచ్చి పొర్లాడిచ్చి మరి తంతాను…. ఏమనుకున్నావో ఏమో….” అని కోపంగా చెప్పింది.
తార చెప్పిన మాటలకి లత ఆశ్చర్యంగా నావైపు చూస్తూ “ నీకు మరదలుందా….. నువ్వు అనాధవి కదా….” అని చెప్తుంటే, తార మధ్యలో కల్పించుకొని “ ఏయ్…. ఇందాకనే చెప్పాను కదే, మళ్ళి నా బావని పట్టుకొని అనాథా, గినాధా అంటావేంటే….” అని లత మీదకి వెళ్తుంటే తన చేతిని పట్టుకొని ఆపాను.
తార నావైపు చూస్తుంటే, “ ఇక చాలు…. వెళ్దాం….” అని చెప్పాను. నా మాటలకి తార కోపంగా లత వైపు చూస్తూ “ తిను నా బావ…. తనకంటూ ఒక కుటుంబం ఉంది…. ఇంకోసారి నా బావ చుట్టుపక్కల కనిపించావే అనుకో, నువ్వు ఎవ్వరికీ కనిపించకుండా గొయ్యి తీసి కప్పెట్టేస్తా….” అని వార్నింగ్ ఇచ్చి “ పద బావ….” అని నా చెయ్యి పట్టుకొని బయటికి తీసుకెళ్లింది.
మేము కారు దెగ్గరికి రాగానే నేను ప్రేమగా “ తార….” అని పిలిచాను, తను వెనక్కి తిరుగుతూ “ ఏంటి బావ….” అని అడిగింది. నేను క్షణం ఆలస్యం చెయ్యకుండా తనని గెట్టిగా కౌగిలించుకున్నాను, నేను అలా హఠాత్తుగా కౌగిలించుకుంటానని తెలియక తార ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసింది, మా వెనకున్న పూజ, నీలిమ, రాధ కూడా అంతే ఆశ్చర్యంగా చూస్తున్నారు.
కాసేపటికి తార తేరుకొని సంతోషంగా తనుకూడా నన్ను కౌగిలించుకుంది కాని తన వీపుకి తడి తెలియడంతో నన్ను దూరం జరిపి నావైపు చూసింది. నేను కన్నీళ్ళు కారుస్తూ తనవైపు చూస్తున్నాను,
తార అయోమయంగా “ బావ…. ఏమైంది!!…. ఎందుకు ఏడుస్తున్నావ్….” అని అడిగి మళ్ళి తనే కోపంగా “ ఆ ముచ్చు మొహంది అన్న మాటలకు బాధపడుతున్నవా…. ఉండు, ఇప్పుడే దాని సంగతి చెప్తా….” అని ఆవేశంగా వెళ్తుంటే, తన చెయ్యిని పట్టుకొని ఆపాను.
నేను నవ్వుతూ “ ఇవి బాధతో వచ్చే కన్నీళ్ళు కాదు…. ఆనందంతో వచ్చే కన్నీళ్ళు….” అని చెప్పాను, తారకి అర్ధంకాక అయోమయంగా నావైపు చూస్తూ “ ఆనందంతో వచ్చే కన్నీళ్ళ…. అదేంటి….” అని అడిగింది.
నేను నవ్వుతూ “ నీక్కూడా సమయం వచ్చినప్పుడు అర్ధమౌతుంది లే మరదలా….” అని చెప్పాను, దాంతో అందరూ నవ్వేసారు. ఇక మేమందరం కారులో కూర్చుని రాజమండ్రి మొత్తం తిరుగుతున్నాము, కాసేపటికి పుష్కర్ ఘాట్ చేరుకున్నాము.
మేమందరం ఉత్సాహంగా అక్కడున్న షిప్ ( అదే లాంజ్) ఎక్కి ఒక రౌండ్ తిరిగాము, అప్పటికే సాయంత్రం అయ్యింది. మేము గోదావరి అందాలు చూస్తూ మాట్లాడుకుంటూ మళ్ళి పుష్కర్ ఘాట్ దెగ్గర దిగి పక్కనే చల్ల చల్లని రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్ తీసుకున్నాం.
అందరం తాగుదామని గ్లాస్ ఎత్తుతుంటే, రాధ ” one second….” అని అందరిని ఆపింది. అందరం అయోమయంగా చూస్తుంటే, రాధ నవ్వుతూ “ ఇప్పుడు సరదాగా ఒక ఛాలెంజ్ వేసుకుందామా….” అని అడిగింది.
అందరం ఒకేసారి “ ఏం ఛాలెంజ్….” అని అడిగాం, రాధ నవ్వుతూ “ ఇప్పుడు ఈ జంబో రోజ్ మిల్క్ ఒక్క గుక్కలో తాగి ఎవరైతే ఖాళీ చేస్తారో, వాళ్ళే గెలిచినట్టు…. గెలిచిన వాళ్ళు మిగితా వాళ్ళని ఏదైనా ఒక పని చెయ్యమని చెప్పొచ్చు…. వాళ్ళు ఆ పనిని ఖచ్చితంగా చెయ్యాల్సిందే….” అని చెప్పింది.
అందరం ఉత్సాహంగా సరేనని తలాడించాం, రాధ నవ్వుతూ “ రెడీ…. 1… 2… 3… స్టార్ట్….” అని చెప్పింది. అందరూ గబ గబా తాగడానికి ప్రయత్నిoచడం వల్ల చల్లగా ఉన్న రోజ్ మిల్క్ గొంతు నిండిపోయి దగ్గుతూ దాన్ని పూర్తిగా తాగకుండా వదిలేసారు. కాని నేను వేగంగా కాకుండా కొంచం నెమ్మదిగా గుటక వేస్తూ తాగుతూ చివరికి పూర్తిగా తాగేశాను.
నేను నవ్వుతూ అందరివైపు చూస్తుంటే, నలుగురూ కొంచం ఇబ్బందిగా నావైపు చూస్తున్నారు. నేను వెటకారంగా “ రెడీ నా…..” అని అడిగాను, అందరూ సందేహంగానే తలూపారు.
నేను అందరితో “ తార ఆవులా, రాధ మేకలా, నీలిమ కాకిలా, పూజ కుక్కలా గెట్టిగా అయిదు నిమిషాల పాటు ఇక్కడే అందరిముందు అరవాలి….” అని చెప్పాను, దెబ్బకి వాళ్ళందరూ మొహం వేలాడదీసి దీనంగా నావైపు చూస్తున్నారు.
నేను కానివ్వండని సైగ చేసాను, ఇక తప్పదన్నట్టు వాళ్ళు నలుగురూ కొంచం ముందుకు జరిగి పుష్కర్ ఘాట్ జంక్షన్ దెగ్గర నిలబడి గెట్టిగా “ తారైతే అంబా…. అంబా…., రాధైతే మ్హే…. మ్హే…., నీలిమైతే కావ్…. కావ్…., పూజైతే భౌవ్…. భౌవ్….” అని అరిచారు. వచ్చి పోయే జనాలైతే వింతగా చూస్తున్నారు, కొందరైతే చిల్లర కూడా వేసారు, ఇదంతా వాళ్ళకు తెలియకుండా వీడియో తీస్తూ నవ్వుకున్నాను.
అలా అయిదు నిమిషాల తరువాత వాళ్ళు వేగంగా నా దెగ్గరికి వచ్చి నవ్వుతున్న నన్ను చూసి ఒక్కొక్కరూ మొహం కోపంగా పెట్టి నాపై దెబ్బల వర్షం కురిపించారు. నేను దెబ్బలు తింటూ ఆపకుండా నవ్వుతూనే ఉన్నాను.
కాసేపటికి వాళ్ళ కోపం చల్లారింది, నేను చిన్నగా నవ్వుతూ “ అమ్మ…. హా… ఆ… ఆ… ఓడిపోయింది మీరైతే నన్ను కొడుతున్నారేంటే….” అని అన్నాను.
తార ఉడుక్కుంటూ “ ఓడిపోతే మరి ఇంత విచిత్రమైన పని చెయ్యమనాలా…. అందరూ చూసి నవ్వుకుంటున్నారు….” అనింది. నేను కష్టంగా నవ్వు ఆపుకొని “ సరే…. సరే…. ఇప్పటికే చాలా ఆలస్యమైంది…. పదండి, ఇక ఊరికి బయల్దేరుదాం….” అన్నాను.
అందరూ దిగులుగా మొహం పెట్టి “ అప్పుడేనా….” అన్నారు, నేను గంభీరంగా “ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే….” అని అనేసరికి ఇష్టంలేక పోయినా కారులో కూర్చొన్నారు.
ఇక రాజమండ్రి నుంచి తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం, రాధ నాతో “ అవును బావ…. మనం రెస్టారెంట్ లో గొడవ పడిన అమ్మాయి ఎవరు బావ…. నువ్వు తనకి బాగా తెలిసిన వాడిలా మాట్లాడింది….” అని అడిగింది.
నేను కొంచం ఇబ్బందిగా “ ఇప్పుడు అవసరమా….” అని అన్నాను, రాధతో పాటు నీలిమ, పూజ, తార కూడా చెప్పమని బలవంతం చేసారు.
ఇక చేసేదేమీ లేక దీర్ఘంగా శ్వాస వదిలి అందరితో “ లతని నేను కాలేజీ నుండే ప్రేమించేవాడిని, తను కూడా నన్ను ప్రేమిస్తున్నానే చెప్పింది….” అలా కాలేజీలో తనకు చదువులో సహాయం చెయ్యడం, నేను పనిచేసే కంపెనీలోనే తనకి జాబ్ ఇప్పియ్యడం, ప్రమోషన్ కోసం నన్ను ఎలా మోసం చేసి జాబ్ పోగొట్టిందో ఆని వివరంగా చెప్పాను.
నేను చెప్పిందంతా విని వాళ్ళు నలుగురూ కోపంతో ఊగిపోతున్నారు, తార మాట్లాడుతూ “ అంటే బావ…. ఆరోజు నువ్వు చెప్పింది దీని గురించేనా….” అని అడిగింది, నేను అవునని తలూపాను.
తార నిరుత్సాహంగా “ అరే ఛా…. ముందే తెలుసుంటే ఇంకో రెండు చెంప దెబ్బలు ఎక్కువ వేసేదాన్ని…. లేకపోతే, ఆ ముష్టి మొహంది నిన్ను మోసం చేసిందే కాకుండా అన్నన్ని మాటలంటుందా….” అని కోపంగా అరిచింది.
మేమందరం నవ్వుకున్నాం, తరువాత నీలిమ మాట్లాడుతూ “ కాని బావ…. ఆ పొగరుబోతు అమ్మాయి నిన్ను అనాథ అని ఎందుకు అనింది బావ….” అని అడిగింది.
నేను నవ్వుతూ “ తను చెప్పింది నిజమే…. ఒకప్పుడు నేను అనాథనే….” అని చెప్పాను, తార కోపంగా “ బావ….” అని గిల్లింది, నేను నవ్వుతూ “ కాని ఇప్పుడు నాకొక పిన్ని, చెల్లి, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య, ఇంత అందమైన మరదళ్లు ఉన్నారు…. ” అని అన్నాను. నా మాటలకి వాళ్ళు నలుగురూ సిగ్గు పడుతూ చిన్నగా నవ్వుకున్నారు.
అలా సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఊరిలోకి వచ్చేసాం, ముగ్గురిని వాల్ల ఇంటి దెగ్గర దింపేసి మేము కూడా ఇంటికి చేరుకున్నాం. మేము కారు దిగి ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చొన్న వాళ్ళవైపు చూసాము. అనసూయ, నీరజ, మధు మావైపే కోపంగా చూస్తున్నారు. నేను – తార ఒకరి మొహాలు ఒకరం చూసుకొని గుటకలు మింగాం.
The post చంద్ర అభిలాష – 28 appeared first on Telugu Sex Stories.